సోషల్ మీడియాతో ఒక్కటై నిరుపేదలకు తోడ్పాటు - హెల్పింగ్ హార్ట్ ఫౌండేషన్‌తో అన్నార్తులకు సాయం - youth Helping Poor
🎬 Watch Now: Feature Video
Published : Apr 12, 2024, 3:55 PM IST
Youth Helping to Poor through Helping Hearts Foundation : వారంతా వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. కానీ అందరిదీ ఒకటే ఆలోచన. గొప్ప పనులు చేయడానికి సంపన్నులే కానక్కరలేదని, మంచి మనసుంటే చాలని నమ్మారు. అందుకే సోషల్ మీడియా ద్వారా అందరూ స్నేహితులుగా మారారు. చదువుకునే రోజుల్లో డబ్బుల్లేక, జీవితంలో అవకాశాలను చేజిక్కించుకోలేకపోవడంలో ఉండే ఇబ్బందులు స్వయంగా అనుభవించినవారు, తమలాంటి పరిస్థితి మరికొందరికైనా రాకుండా చేయాలని అనుకున్నారు.
వారంతా కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. వారి ఆలోచనలో నుంచే ఊపిరి పోసుకున్నదే హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్. 12 ఏళ్ల కిందట ఓ వ్యక్తి మదిలో మెదిలిన ఈ ఆలోచన క్రమంగా విస్తరించి 100 మందికి చేరింది. సహాయం కోసం ఎదురుచూసే ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతోంది ఈ ఎన్జీవో(NGO). రక్తదానం, విద్యాదానం వంటి సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది వారి ప్రయాణం. మరి, ఆ ఎన్జీవో సంస్థ సేవా ప్రయాణమేంటో వారి మాటల్లోనే విందాం.