నికరంపల్లిలో యువకుడి దారుణ హత్య - అడ్డొచ్చిన వారిపై గొడ్డలితో దాడి - నికరంపల్లిలో యువకుడి హత్య
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 10:21 AM IST
Young Man Brutally Murdered at Nikarampally: నిద్రిస్తున్న యువకుడిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లిలో చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న వెంకటేశ్వర్లు అనే యువకుడిని కాశీ రామిరెడ్డి అనే మరో యువకుడు విచక్షణా రహితంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు.
Young Man Was Hacked to Death With Axe: స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నిద్రపోతున్న సమయంలో రామిరెడ్డి అనే యువకుడు నరికి చంపినట్లు తెలిపారు. అడ్డుకోవడానికి వచ్చిన వెంకటేశ్వర్లు భార్యపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకుని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ హత్యకు గల కారణాలపై వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ హత్య జరగడానికి వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.