LIVE: నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో యోగా ఉత్సవాలు - ప్రత్యక్షప్రసారం - Yoga Day 2024 LIVE - YOGA DAY 2024 LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 7:02 AM IST
|Updated : Jun 21, 2024, 8:13 AM IST
YOGA Live FROM NIJAM COLLEGE IN HYDERABAD : హైదరాబాద్‌లోని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో యోగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ రాధాకృష్ణన్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ హాజరయ్యారు. పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. యోగా వ్యక్తులు, సమాజ ఆరోగ్యానికి దోహద పడుతుందని చెబుతున్నారు. మన సుసంపన్నమైన ప్రాచీన భారతీయ వారసత్వంలో యోగా అంతర్భాగమని గవర్నర్ ఈ సందర్భంగా చెబుతున్నారు. మనస్సు, శరీరాల మధ్య సమతుల్యతను సాధించడంలో యోగా సహాయపడుతుందని గవర్నర్ అన్నారు. ఎన్నో అద్భుతాలకు, మరెన్నో ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు అయిన భారతదేశంలోనే యోగా కూడా పుట్టింది. యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి మహర్షి. మన ఉపనిషత్తులు, భగవద్గీతలోనూ యోగా ప్రస్తావన ఉంది. ఇండియాలో పురుడుపోసుకున్న యోగా ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. యోగాతో సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా రూపుదిద్దుకుంటాడని నిపుణలు చెబుతున్నారు. అక్కడ ఉన్నవారు యోగా చేస్తున్నారు.
Last Updated : Jun 21, 2024, 8:13 AM IST