Tirumala Break Darshan Cancelled at january 7 : తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం (7వ తేదీన) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో ఆ రోజు బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని టీటీడీ వెల్లడించింది. ఈరోజు(సోమవారం) వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎటువంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని వెల్లడించింది. ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించడాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు సాగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల పాటు రోజుకు దాదాపు 70 వేలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే క్యూలైన్లలోకి అనుమతించి దర్శనాలు కల్పించేలా ప్రణాళిక చేపట్టారు. ఏకాదశి మొదలు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లకు పలు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకన్న చౌదరి తెలిపారు.
శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ - ఇలా చేస్తే టీటీడీ క్యాలెండర్లు, డైరీలు ఇంటికే!
'కొండంత' అక్రమాలు - బాబాయ్ కోటాలో నాలుగు లక్షల బ్రేక్ దర్శనాలు!