ఆలయంలో వైసీపీ ఎన్నికల ప్రచారం- మండిపడుతున్న భక్తులు - YCP election Campaign - YCP ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 6:39 PM IST
YCP Leaders Election Campaign in Dwaraka Tirumala : ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం వైసీపీ ఎన్నికల ప్రచారానికి అడ్డాగా మారింది. ఇంతవరకు వైసీపీ నేతల ప్రచారానికి ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో పాటు తాజాగా ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా ఆ జాబితాలో చేరారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘిస్తూ దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యుడు యానాదయ్య వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఇందుకు నిదర్శనం.
ద్వారకా తిరుమల కేశఖండనశాలలో క్షురకులను కలిసి సీఎం జగన్‌కు ఓటు వేసి గెలిపించాలని ట్రస్ట్ బోర్డు సభ్యుడు యానాదయ్య కోరారు. దేవస్థానం ప్రాంగణంలో ఎన్నికల ప్రచారం చేయడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు స్పందించకపోవడం పట్ల వైసీపీకి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో వైసీపీ ఎంపీ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలకు ఆలయంలో భోజనాలు ఏర్పాటు చేయడంపై ఈవో ఆరోపణలు ఎదుర్కొన్నారు.