ETV Bharat / state

తిరుపతి తొక్కిసలాట ఘటన - న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశం - JUDICIAL INQUIRY ON TTD INCIDENT

తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం - 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు

Government Orders Judicial inquiry into Tirupati Stampede incident
Government Orders Judicial inquiry into Tirupati Stampede incident (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2025, 7:34 PM IST

Govt Ordered Judicial Inquiry into Tirupati Stampede incident: తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఇందుకోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనపై 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే జనవరి 8వ తేదీన తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే పలువురు భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీరియస్​గా తీసుకున్నారు. అనంతరం ఘటన జరిగిన ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీసిన చంద్రబాబు న్యాయ విచారణకు ఆదేశిస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుపతి తొక్కిసలాట ఘటన - కేంద్ర హోంశాఖ సమీక్ష

తొక్కిసలాటలో గవర్నర్​, సీఎంకు ఏం సంబంధం? - పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.