యాదాద్రి ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు- వటపత్రశాయి అలంకారంలో స్వామివారు - Annual Bramhotsavam in yadadri
🎬 Watch Now: Feature Video


Published : Mar 14, 2024, 2:48 PM IST
Yadadri Varshika Bramhotsavam 2024 : రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందుగా స్వామి వారిని, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారిని వటపత్రశాయి అలంకారంలో వజ్రవైఢూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో డెకరేట్ చేశారు.
వటపత్రశాయి రూపంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాద్యాలు, వేదమంత్రాల నడుమ పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. మర్రి ఆకులపై స్వామిని పవళించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ నారాయణ తత్వము విశిష్ఠతను భక్తులందరికీ వేదపండితులు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 17 వ తేదీన ఎదుర్కోలు ఉత్సవం, 18న తిరుకళ్యాణం, 19న రథోత్సవం నిర్వహించనున్నారు. లక్ష్మీ నరసింహా స్వామి వారిని దర్శించుకునేందుకు యాదాద్రి భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. ప్రతిరోజు వేదపండితులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.