యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా ఊంజల్ సేవ - Unjal Seva Utsavam
🎬 Watch Now: Feature Video
Published : Feb 2, 2024, 9:09 PM IST
Yadadri Unjal Seva Utsavam : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా నిత్య పూజలతో ఊంజల్ సేవ మహోత్సవం జరిగింది. శుక్రవారం స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, ఊంజల్ సేవ పర్వాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. ఇవాళ సాయంత్రం ఆలయంలో ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఊంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి వివిధ రకాల పూలతో, తులసి దళాలతో, ఆలయ అర్చకులు పూజలు చేశారు. ఊంజల్ సేవలో కొలువై ఉన్న ఆండాళ్ అమ్మవారికి అర్చక స్వాములు హారతినిస్తూ కీర్తన చేశారు.
Unjal Seva in Yadadri Bhuvanagiri : వేద మంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాల సన్నాయి మేళం నడుమ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. మొదటగా శ్రీ మన్యు సూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారికి ఆలయంలోని అద్దాల మండపంలోని ఉయ్యాలలో శయనిపు సేవ నిర్వహించారు.