యాదాద్రిలో వైభవంగా జయంతి ఉత్సవాలు - కాళీయమర్దన అవతారంలో స్వామివారి దర్శనం - Yadadri Jayanti Utsavalu - YADADRI JAYANTI UTSAVALU
🎬 Watch Now: Feature Video
Published : May 21, 2024, 2:50 PM IST
Yadadri Jayanti Utsavalu Second Day : తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు రెండోరోజు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన కాళీయమర్దన అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. వేదపారాయణాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య నారసింహుడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి నిత్య మూలమంత్ర హవనం, లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. లక్ష పుష్పార్చనకు ముందు స్వామివారికి మంగళ నీరాజనం, మంత్రపుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు.
జయంతి ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం సహస్ర కళాభిషేకంతో ఉత్సవాలను పరిసమాప్తి పలకనున్నారు. భక్తులకు స్వామివారి విశేషతను వివరించనున్నారు. మరోవైపు వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఉత్సవాలకు వచ్చిన వారితో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. భక్తిశ్రద్ధలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. తాగునీరు, షెడ్లు వంటి సదుపాయాలను కల్పించారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు.