thumbnail

వంటింట్లో వెలుగుల "దీపం" - ఉచిత గ్యాస్ అమలుపై సర్వత్రా హర్షాతిరేకాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Womens Reaction to Implementation of Free Gas Cylinder Scheme in AP : ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి సర్కార్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రక్రియ జోరుగా సాగుతుంది. దీపం పథకం పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో ఆర్థిక భారం తప్పుతుందంటున్నారు. ఇది నిజమైన దీపావళి పండుగ అంటూ మహిళలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) చేతుల మీదుగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ అందించనున్నారు. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందనున్నాయి. దీనిపై మహిళల నుంచి సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. విజయవాడకు చెందిన పలువురు మహిళలు బాణాసంచా కాల్చి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.