ETV Bharat / state

పేరుకే టాస్​ గేమ్​ - లాక్​ అయితే లైఫ్​ రిస్కే! - GAMBLING GAME

ఈ ఆటకు బానిసైతే జీవితం ‘చిత్తే’ - తీవ్రత తెలిసి దాడులు చేస్తున్న పోలీసులు

Gambling is Rampant in Borders of Anakapalle And Alluri District
Gambling is Rampant in Borders of Anakapalle And Alluri District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2024, 12:34 PM IST

Gambling is Rampant in Borders of Anakapalle And Alluri District : పది నుంచి ఇరవై మంది వరకు ఊరవతల తోటల్లో చేరుతారు. ఒక్కొక్కరు రూ.1000 చొప్పున పందెం కడతారు. ఆ డబ్బంతా బరిలో ఉంచుతారు. వరుసలో ఒకరి తరువాత మరొకరు రెండు నాణేలను పైకి ఎగురవేస్తారు. నేలపై రెండు బొమ్మలు ఎవరికి పడితే ఆయనే విజేత. బరిలో సొమ్మంతా అతడికే చెందుతుంది. చాపకింద నీరులా విస్తరించుకుపోతున్న ఈ జూదాన్ని నియంత్రించడం పోలీసులకు ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది.

చిత్తులాట లేదా ఏటులాటగా ఈ జూదాన్ని వ్యవహరిస్తున్నారు. కొందరు కాయిన్స్‌ గేమ్‌గా పిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం గొలుగొండ మండలం అమ్మపేట సమీపంలోని తోటల్లో జరుగుతుందని తెలిసి పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఆ సమయంలో కొందరు పరారు కాగా నలుగురు దొరికిపోయారు. నర్సీపట్నం సమీపంలోని జోగునాథునిపాలెం వద్ద ఓ ప్రైవేటు లే-అవుట్లో ఏటులాట జరుగుతుందని నిఘా పోలీసులు అటువైపు వెళ్లారు. వీరొస్తున్నట్టు దూరం నుంచే గమనించి అందరూ పరారయ్యారు. నాణేలు ఎగురవేసే ఆట అనకాపల్లి-అల్లూరి జిల్లా సరిహద్దుల్లో జోరుగా సాగుతోంది. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. గొలుగొండ- కొయ్యూరు మండలాల సరిహద్దుల్లో బాలారం-చోద్యం మధ్య తోటల్లో తరచూ జూదం నిర్వహిస్తున్నారు. పలు మండలాల నుంచి జూదరులు వస్తున్నారు.

నర్సీపట్నం టౌన్‌ స్టేషన్‌ పరిధిలోని ఉత్తరవాహిని ప్రాంతం, షణ్ముఖనగర్, గ్రామీణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని వేములపూడి శివార్లలో అప్పుడప్పుడు ఈ జూదం జరుగుతోందని సమాచారం. కూడలిలో కొన్ని దుకాణాలు, చెట్ల కింద బైకులు నిలిపేసి జూదరులు తోటల్లోకి వెళుతుంటారు. పోలీసులు లేదా అనుమానాస్పద వ్యక్తులెవరైనా ఇటువైపు వస్తుంటే గమనించి సమాచారం ఇచ్చేందుకు అన్ని దారుల్లో కూలీలను కాపలా ఉంచుతున్నారు. వీరికి రోజుకు రూ.600 కూలి, బిర్యానీ పొట్లం ఇస్తున్నారు. గంటల వ్యవధిలోనే ఆట ముగించి జారుకుంటారు. ఈ నెల 18న అమ్మపేటలో అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల, కొయ్యూరు మండలం బాలారం, మాకవరపాలెం మండలం వజ్రగడ, గొలుగొండ మండల చోద్యానికి నలుగురు నాణేల ఆట ఆడుతూ పట్టుబడ్డారు. ఆటకు వినియోగించే నాణేలు, రూ.7వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

'ఆయ్‌అండీ, మావాడే గెలుస్తాడండి ' బెట్‌ ఎంతండీ? ఇదీ గోదావరి జిల్లాల పందెం రాయుళ్ల తీరు! - Analysis On AP Elections 2024

డబ్బులు పోగొట్టుకున్నవారికి బంగారం తాకట్టు పెట్టుకుని అప్పులివ్వడానికి అక్కడే కొందరు వడ్డీ వ్యాపారులు ఉంటున్నారు. నూటికి పది రూపాయల వడ్డీ తీసుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో నర్సీపట్నం సుబ్బారాయుడుపాలెం-అప్పన్నదొరపాలెం శివార్లలో ఎక్కువగా ఆడేవారు. గబ్బాడలో రెండు నెలల క్రితం వరకు నిరాటంకంగా ఆడేవారు. గ్రామపెద్దలు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడంతో తరచూ దాడులు చేయడంతో కట్టడి జరిగింది. కొన్నిచోట్ల వేల రూపాయలు జేబులో ఉంటేగాని ఆటకు అనుమతించడం లేదంటున్నారు. ఈ ఆటని వ్యసనంగా మార్చుకున్న గొలుగొండ మండలానికి చెందిన ఓ వ్యక్తి రూ. లక్షలు పోగొట్టుకున్నారని తెలుస్తోంది.

సమాచారం ఇచ్చి సహకరించాలి : నాణేలు ఎగురవేసి ఆడే ఏటులాటని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని నర్సీపట్నం గ్రామీణ సీఐ ఎల్‌.రేవతమ్మ తెలిపారు. పౌరులు 100 నెంబరుకు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారిపేర్లు గోప్యంగా ఉంచుతామని వివరించారు. జూదాలు నిర్వహించడం చట్టప్రకారం నేరమని, నిర్వాహకులు ఎవరన్నది కనిపెట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఆన్​లైన్​ బెట్టింగుల విషవలయం - కుమారుడి అప్పులు తీర్చలేక కుటుంబం బలవన్మరణం - Family Suicide Due to Betting Debts

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.