నీటి ఎద్దడితో రోడెక్కిన మహిళలు: పది రోజులుగా నీటి సమస్య ఎదుర్కొంటున్నామని ఆవేదన - Women Protest on Road in YSR Dis
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-02-2024/640-480-20828764-thumbnail-16x9-women-protest-on-road-due-to-water-problem-in-ysr-district.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2024, 1:30 PM IST
Women Protest on Road Due to Water Problem in YSR District: రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నానని గొప్పలు పోతున్న జగన్ తన సొంత ఇలాకాలో తాగునీటి సమస్యను ఎందుకు పట్టించుకోవటం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల నుంచి తాగునీటి సమస్యతో (Water Crisis) సతమతం అవుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
Water Crisis Faced Since 10 Days: తాగునీటి సమస్య పరిష్కరించాలని వైయస్ఆర్ జిల్లా మైదుకూరులో (mydukur) మహిళలు ఆందోళన (Protest) చేపట్టారు. కేసీ నగర్ వద్ద ఖాళీ మహిళలు బిందెలతో రోడ్డెక్కి రాకపోకలను అడ్డుకున్నారు. మహిళల ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించిపోవటంతో (Traffic jams) పోలీసులు, పురపాలక అధికారులు (Police, municipal officers) అక్కడికి చేరుకున్నారు. సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు మహిళలకు సర్ది చెప్పారు. పది రోజులుగా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.