మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు మహిళ కానిస్టేబుల్ నిరసన - Constable Nagamani About SI
🎬 Watch Now: Feature Video


Published : Jan 31, 2024, 10:20 PM IST
Woman Constable Protest against SI at Medipally : హైదరాబాద్ కమిషనరేట్‌లో పని చేసే మహిళ కానిస్టేబుల్ నాగమణి రాచకొండ కమిషనరేట్ పరిధి మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. తన భర్త వరుణ్‌పై తప్పుడు భూ వివాదం కేసు నమోదు చేసి రిమాండ్ తరలించేందుకు ఎస్సై శివకుమార్ ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. నాగమణికి, ఆమె కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా భూ వివాదం ఉంది.
Constable Nagamani About SI at Medipally : కానిస్టేబుల్ నాగమణి భర్త వరుణ్ తమపై దాడి చేశారని భూ వివాదంలో ఉన్న ప్రత్యర్థులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరుణ్‌పై కేసు నమోదయింది. గతంలో ఎస్సై శివకుమార్‌పై డీసీపీకి ఫిర్యాదు చేయడంతో, తమపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నాగమణి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సై శివకుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.