గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం - క్షణాల్లో కాపాడిన జాలర్లు - Woman Attempted Suicide - WOMAN ATTEMPTED SUICIDE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 1:45 PM IST

Woman Attempted Suicide by Jumping Into Godavari in Rajamahendravaram : భర్తతో విభేదాల కారణంగా గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు, మత్స్యకారులు అప్రమత్తమై రక్షించిన ఘటన రాజమండ్రి రోడ్డు కమ్ రైల్వే వంతెన (Rajahmundry Road cum Railway Bridge) వద్ద జరిగింది. నగరానికి చెందిన వివాహితకు భర్తతో కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఇవి తారస్థాయికి చేరడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో రోడ్డు కమ్ రైల్వే వంతెనపై నుంచి గోదావరిలోకి దూకేసింది. ఘటనను చూసివ వాహనదారులు వెంటనే 100కు డయల్‌ చేసి పోలీసులుకు సమాచారమిచ్చారు. తక్షణమే స్పందించిన పోలీసులు దోబీఘాట్‌ వద్ద జాలర్లను అప్రమత్తం చేశారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే జాలర్లు బోటుపై అక్కడి చేరుకుని మహిళను రక్షంచారు. వివాహితను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా వారికి తమ కుటుంబ సమస్యలు గురించి చెప్పింది. దీంతో పోలీసులు భర్తతో పాటు అతని కుటుంబీకులను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.