కుటుంబ తగాదాలతో భర్త, అత్తపై దాడి చేయించిన కోడలు - Wife Attack on Husband - WIFE ATTACK ON HUSBAND
🎬 Watch Now: Feature Video
Published : May 17, 2024, 7:50 PM IST
Wife Attack on Husband in Hyderabad : హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోప్‌ఖానలో జరిగిన గొడవ భార్యభర్తల తగాదల వల్లే జరిగిందని, సామాజిక మాద్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని సీఐ విజయ్ కుమార్ అన్నారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం భార్యభర్తల మధ్య గత ఐదు సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. విసుగు చెందిన భార్య సంతోషి తన సోదరులకు ఫోన్ చేసింది. కోపోద్రిక్తులైన ఆమె అన్నదమ్ములు ఈ నెల 10న రామేశ్వర్, అత్త గంగాబాయిపై కత్తులు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు.
భార్యతో సహా ముగ్గురు అన్నదమ్ములపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్సురెన్సు డబ్బుల కోసం దాడి చేయించారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని సీఐ విజయ్ కుమార్ తెలిపారు. తమకు ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితులు ఉస్మానియా ఆసుపత్రులో చికిత్స పొందుతున్నారని చెప్పారు. దాడికి సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.