టిడ్కో ఇళ్లలో మంచినీళ్లొద్దా? బిందెలతో మహిళల నిరసన
🎬 Watch Now: Feature Video
Water Problems in TIDCO Houses in Mangalagiri : టిడ్కో ఇళ్లలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri) లో మహిళలు నిరసన చేపట్టారు. తాగునీరు ఇవ్వాలంటూ ఖాళీ బిందెలతో రోడ్డుపై నిలబడి నినాదాలు చేశారు. నాలుగైదు రోజులకు ఒకసారి నీళ్లు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే (MLA) ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. తాగునీరు ( Drinking Water) అందించకపోతే మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ధర్నా (Protest) చేస్తామని హెచ్చరించారు.
'పనులు మానుకుని నీటి ట్యాంకర్ల కోసం వేచి చూసి బిందెలతో మోసుకుంటున్నాం. పై అంతస్తుల్లో ఉండే వాళ్లకు ఇలా నీళ్లు మోసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఒకావిడ బిందెతో నీళ్లు తీసుకెళ్తూ కాలు జారి పడింది. వయసుపైబడిన వాళ్లకు ఇది మరింత గండంగా మారింది. అధికారులు స్పందించి వెంటనే మాకు పరిష్కారం చూపాలి.' - బాధిత మహిళలు