అమరలింగేశ్వరస్వామి ఆలయంలో తాగునీటి సమస్య - భక్తుల మండిపాటు
🎬 Watch Now: Feature Video
Water Problem to Devotees : పల్నాడు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం అమరలింగేశ్వరస్వామి ఆలయంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని భక్తులు గగ్గోలు పెడుతున్నారు. ఆలయ పరిధిలో ఎక్కడా తాగునీరు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి ఆలయానికి పక్కనే ఉన్న కృష్ణానది నుంచి నీటి సరఫరా చేసేవారు. అయితే ప్రస్తుతం కృష్ణానదిలో నీరు లేకపోవటంతో సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. వేసవి ప్రారంభం కావటంలో మండలు ఎండిపోతున్నాయి. దీంతో భక్తుల గొంతెండుతోంది.
Water Problem in Amaralingeswara Swamy Temple : ఆలయానికి వెళ్లే ముందు కాళ్లు కడుక్కునే పరిస్థితి కూడా లేదు. నీటి సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవటం లేదు. కృష్ణలో నీరు లేకపోతే ప్రత్యామ్నాయం ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచించలేదు. సమీపంలోని వైకుంఠపురం ఎత్తిపోతల నుంచి నీరు తరలించే అవకాశం ఉన్నా దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. నీటి సమస్య కారణంగా ఇప్పటికే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఆలయ ప్రాంగణంలో కుళాయిలు, బోర్ల నుంచి నీరు రావటం లేదు. రేపు శివరాత్రి పర్వదినం కావటంతో భక్తులు భారీగా తరలివస్తారు. అధికారులు కనీసం తాగునీటిని ఏర్పాట్లు చేయడం లేదని భక్తులు మండిపడుతున్నారు.