రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన వరంగల్ ఐఎంఏ బృందం - WARANGAL IMA Team TRIBUTE TO RAMOJI - WARANGAL IMA TEAM TRIBUTE TO RAMOJI
🎬 Watch Now: Feature Video
Published : Jun 12, 2024, 10:32 PM IST
Warangal IMA Team Mourned Ramoji Rao Death : అక్షర సూరీడు, నిత్య కృషీవలుడు, రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుకు వరంగల్ వైద్యులు ఘనంగా నివాళులర్పించారు. మడికొండలోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కాళీప్రసాద్ రావు నేతృత్వంలో వైద్య బృందం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అక్షర శిఖరం ఒరిగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రామోజీరావు తెలుగు ప్రజలందరికీ నిరంతర చైతన్య స్ఫూర్తిగా నిలిచారని, సూర్యచంద్రులున్నంతవరకూ ఆయన ఖ్యాతి వెలుగుతూనే ఉంటుందని కొనియాడారు. పత్రికారంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న మహా యోధుడు రామోజీరావని గుర్తుచేసుకున్నారు. విపత్తుల వేళ బాధితులకు బాసటగా నిలిచి సామాజిక బాధ్యతను నిర్వర్తించిన మానవీయ మనిషిగా కొనియాడారు. అక్షరానికి ఉన్న విలువను తన ఈనాడు పత్రిక ద్వారా రామోజీరావు తెలియజేశారని డా.పి. కాళీ ప్రసాద్ శ్లాఘించారు. సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి మహోన్నత శిఖరాలకు చేరుకున్న ధన్యజీవి అని కొనియాడారు.