ఆపత్కాలంలో ఆపన్న హస్తం - నిండు గర్భిణీకి వీఎంసీ సిబ్బంది చేయూత - VMC Staff Saved Pregnant - VMC STAFF SAVED PREGNANT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2024, 4:55 PM IST
VMC Staff Saved Pregnant in Vijayawada : వరద బాధిత ప్రాంతంలో ఓ నిండు గర్భిణీని విజయవాడ నగరపాలక సంస్థ బృందం రక్షించారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతమైన వాంబే కాలనీల్లో ఓ గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతుంది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరిలోనూ ఒకటే ఆందోళన. ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక దిక్కుచోచని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. దీంతో వీఎంసీ అధికారులు వెంటనే స్పందించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
బాధితురాలిని వాంబే కాలనీ నుంచి సింగ్ నగర్ ఫ్లైఓవర్‌కు తరలించే క్రమంలో ఆమె బోటులోనే ప్రసవించింది. అప్పటికే ఫైఓవర్ వద్దకు విజయవాడ నగర పాలక సంస్థ బృందం అక్కడికి చేరుకున్నారు. అనంతరం తల్లి, బిడ్డను అంబులెన్స్‌లో సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆపత్కాలంలో సహాయం అందించిన వీఎంసీ సిబ్బందికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.