వివేకా హత్య కేసులో దస్తగిరికి బెయిల్- 100రోజులుగా కడప జైళ్లోనే
🎬 Watch Now: Feature Video
Viveka Murder Case Approver Dastagiri Granted Bail: వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి కడప జిల్లా కోర్టు బెయిలు మంజూరు చేసింది. అట్రాసిటీ, దాడి కేసుల్లో దస్తగిరి అరెస్టై దాదాపు వంద రోజులకు పైగానే కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఓ అమ్మాయిని కులం పేరుతో దూషించి, కిడ్నాప్ చేయబోయాడనే ఫిర్యాదు మేరకు యర్రగుంట్ల పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ కేసులో రెండు వారాల కిందట దస్తగిరికి హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.
బెయిలు నుంచి బయటికి రాకముందే వేముల పోలీసులు దస్తగిరిపై దాడి కేసు నమోదు చేసి పీటీ వారంట్ కింద అరెస్ట్ చూపించారు. దీంతో వేముల పోలీసులు పెట్టిన దాడి కేసులో బెయిలుకు దరఖాస్తు చేసుకోగా, ఇవాళ కడప జిల్లా కోర్టు బెయిలు మంజూరు చేసింది. రేపు సాయంత్రం కడప జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. వైసీపీ నాయకులు పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చి కావాలనే చిన్న కేసుల్లో బెయిలు రాకుండా చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.