షాద్​నగర్​లో రోడ్డు ప్రమాదం- కంటైనర్​ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి - Road Accident in Shadnagar - ROAD ACCIDENT IN SHADNAGAR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 5:19 PM IST

Viral Video Man Died in Road Accident in Shadnagar : రంజాన్​ పండగ వేళ రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ సంఘటన అక్కడున్న స్థానికులతో పాటు వాహనదారులను సైతం కలచివేసింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని కంటైనర్​ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో చోటు చేసుకుంది. షాద్​నగర్​​ ఎస్సై నయీం తెలిపిన వివరాల ప్రకారం, షాద్​నగర్​ పురపాలక ఫరూక్​నగర్​లో నివసించే మహమ్మద్ అబ్దుల్ సలీం(49) పాత ఇనుప సామాగ్రి వ్యాపారం చేస్తున్నాడు.  

Road Accident at Shadnagar in RangaReddy : బుధవారం పట్టణంలోని జాతీయ రహదారి రోడ్డు దాటుతుండగా నాందేడ్​కు చెందిన కంటైనర్ హైదరాబాద్​ నుంచి జడ్చర్ల వైపు వెళ్తూ సలీంను ఢీకొట్టింది. ఈ క్రమంలో సలీంపై కంటైనర్​ వెళ్లడంతో అతడు అక్కడికక్కడికే మృతి చెందాడు. ఈ ఘటన సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. సలీం కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నయీం తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.