ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలు శూన్యం - విపక్ష పార్టీలు ఆగ్రహం - Violated the Election Code
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 20, 2024, 1:49 PM IST
Violated the Election Code Kurnool District : ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ సృష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ వైసీపీ నేతలు పెడచెవిన పెడుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఓ మద్యం దుకాణంలో సూపర్ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
Adoni in Kurnool District : అధికార ప్రతినిధులు సమావేశంలో ఓ మద్యం దుకాణంలో పనిచేసే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎన్నికల కోడ్‌ను ఉల్లఘింస్తే గంటన్నరలో పరిష్కరం అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పే అధికారులు ఆధారాలు లభించినప్పటికీ కోడ్ ఉల్లఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.