బై బై గణేశా - భక్తుల సందడి, నృత్యాల నడుమ గంగమ్మ ఒడికి చేరుతున్న గణనాథులు - Vinayaka Nimajjanam celebrations - VINAYAKA NIMAJJANAM CELEBRATIONS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 16, 2024, 12:33 PM IST
Vinayaka Nimajjanam Celebrations held Grandly : రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో భాగంగా లడ్డూ వేలంపాటలు, గణనాథుల ఊరేగింపు వేడుకలు కోలాహలంగా జరిగాయి. తొమ్మిదిరోజులు నిర్విగ్నంగా పూజలు అందుకున్న గణనాథులు భక్తుల సందడి, నృత్యాల నడుమ గంగమ్మ ఒడికి చేరారు. గుంటూరు JKC ఓల్డ్ స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాట 7లక్షల పదివేల భారీ ధర పలికింది. మంగళగిరి నియోజకవర్గంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. మేళతాళాలు, భక్తుల కేరింతల నడుమ గణనాథులు కృష్ణమ్మ ఒడికి చేరారు. బాపట్లజిల్లా చీరాల మండలంలోని వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం, చినగంజాం సముద్రతీరాల్లో గణేషుని నిమజ్జనాలతో సందడి నెలకొంది.
ప్రకాశం జిల్లాలోని సముద్ర తీరాల్లోనూ పెద్ద ఎత్తున గణనాథుడి నిమజ్జనాలు జరిగాయి. ఒంగోలు, చీమకుర్తి, సంతనూతలపాడు ప్రాంతాల నుంచి గణనాథుడి విగ్రహాల్ని నిమజ్జనం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఒంగోలు నగరంలో డీజేలు, తప్పెట్ల మోతల నడుమ వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నాపెద్ద డ్యాన్సులు చేస్తూ సందడిగా గణనాథుల్ని సాగనంపారు. విశాఖ ఆర్కే బీచ్లో వినాయక నిమజ్జన వేడుకలు కన్నులపండువగా జరిగాయి. మధురవాడ రేవులపాలెంలో అభిషేకాలు, పూజలు, భజన కార్యక్రమాలతో భక్తులు గణేశుడ్ని పూజించారు.