NARA LOKESH RESPONSE STUDENT PROBLEM SOLVED: మంత్రి నారా లోకేశ్ చొరవతో ఎన్టీఏ జేఈఈ మెయిన్స్ పరీక్ష కల నెరవేరింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఎన్టీఏ (National Testing Agency) చేసిన తప్పిదాల కారణంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేకపోతున్నానంటూ ఒక విద్యార్థి వాపోయాడు. దీనికి సంబంధించిన కథనం సోషల్ మీడియాలో రావడంతో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. సమాచారం అందిన 30 నిమిషాలలోనే సమస్యకు పూర్తి పరిష్కారం దొరికినట్లు విద్యార్థి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు.
తిరుపతి జిల్లా ఎంఆర్ పల్లి నారాయణ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న ఆకుల వైష్ణవ రెడ్డి అనే విద్యార్థి జేఈఈ మెయిన్స్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నాడు. అయితే తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు చేసినప్పటికీ, అడ్మిట్ కార్డులో పేరు వేరొకరిది రావడంతో విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై సంబంధిత విద్యార్థి గత వారం రోజులుగా ఎన్టీఏకు మెయిల్స్, ఫోన్ ద్వారా సంప్రదించాడు. సమస్య పరిష్కరిస్తామని చెప్పిన ఎన్టీఏ చివరికి చేతులెత్తేసింది.
దీంతో ఇవాళ ఉదయం చెర్లోపల్లి బైపాస్ వద్ద ఉన్న అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రం వద్ద సిబ్బందిని కలిసి పరీక్షకు అనుమతిపై నారాయణ కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థి తండ్రి, విద్యార్థి ప్రయత్నించారు. అయినా కూడా వారు ఏమీ చేయలేదు. దీంతో తమకు న్యాయం చేయాలని మంత్రి నారా లోకేశ్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నానికి సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించారు. వివరాలు తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్ వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారితో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యను నిమిషాల్లో పరిష్కరించారు.
అదే విధంగా ఒక ఉన్నతాధికారిని అయాన్ డిజిటల్ జోన్ వద్దకు పంపించారు. దీంతో విద్యార్థిని మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన జేఈఈ పరీక్షకు అనుమతించారు. జేఈఈ మెయిన్స్ రాసేందుకు ఏర్పాట్లు చేయించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి విద్యార్థి, తల్లితండ్రులు, కళాశాల ప్రిన్సిపల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అందుకే విద్యాశాఖ తీసుకున్నా - కష్టపడితేనే విజయం: లోకేశ్
మంత్రి నారా లోకేశ్ సాయం - గల్ఫ్‌లో చిక్కుకున్న మహిళ క్షేమంగా ఇంటికి