ఆహారం కోసం వచ్చి నదిలో చిక్కుకున్న ఏనుగు- గంటపాటు అవస్థలు - Elephant stuck in river
🎬 Watch Now: Feature Video
Published : Jul 29, 2024, 6:43 PM IST
Elephant Stuck In River : జనవాసాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఓ ఏనుగు నదిలో చిక్కుకుపోయింది. ఈ ఘటన కేరళలోని మలప్పురంలో జరిగింది. ఆహారం కోసం వెతుకుతూ కరులై అడవి నుంచి ఆదివారం రాత్రి ఓ ఏనుగు బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే కరింపుజ నది దాటి జనావాసాల్లోకి వచ్చేందుకు యత్నించింది. రాత్రి ప్రవాహం తక్కువగా ఉండడం వల్ల పలాంకుర వంతెన వద్దకు చేరుకుంది. అయితే, సోమవారం ఉదయం అకస్మాత్తుగా ప్రవాహం పెరిగిపోవడం వల్ల నదిలోనే చిక్కుకుపోయింది. అనేక సార్లు దాటేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. సుమారు గంటపాటు ప్రయత్నించిన గజరాజు ఎట్టకేలకు ఒడ్డుకు చేరుకుంది. ఈ దృశ్యాలను స్థానికులు వంతెన పైనుంచి కెమెరాలో బంధించడం వల్ల వైరల్గా మారాయి.
Baby Elephant Fell Into 30 Foot Well : ఇటీవల నీటి కోసం వచ్చిన ఓ గున్న ఏనుగు ప్రమాదవశాత్తు 30 అడుగుల బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది సుమారు 6గంటలు శ్రమించి రక్షించారు. తమిళనాడు నీలగిరి జిల్లాలోని కోలపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గున్న ఏనుగును బయటకు తీస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.