కమలం గుర్తుకు ఓటు వేసి శ్రీనివాస్ మామయ్యను గెలిపించండి: వెంకటేష్ - Venkatesh election campaign - VENKATESH ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-05-2024/640-480-21423167-thumbnail-16x9-venkatesh-election-campaign.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 9, 2024, 8:03 AM IST
Venkatesh Election Campaign: మంచి తనానికి మారు పేరు, మాట ఇస్తే చేసి చూపించే వ్యక్తి కామినేని శ్రీనివాస్ అని ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్ అన్నారు. కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తరఫున ఎన్నికల ప్రచారంలో వెంకటేష్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలంలోని పడమటిపాలెం కైకలూరు గాంధీ బొమ్మ కూడలి వరకు వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు.
మీ వెంకీ మామగా,పెళ్లికాని ప్రసాద్‌గా అడుగుతున్నా కమలం గుర్తుకు ఓటు వేసి శ్రీనివాస్ మామయ్యను గెలిపించాలని వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. మీ భవిష్యత్తు బాగుపడాలంటే మే 13న అందరూ బాధ్యతగా ఓటు వేయాలనీ, ఎవరికి ఏ కష్టం వచ్చినా కామినేని అండగా ఉంటారని సూచించారు. కైకలూరు ప్రజలు ఎంతో చైతన్యం కలిగిన వారని, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్థానిక ఎన్డీఏ కార్యాలయం నుంచి పడమటిపాలెం, ఎస్‌ఆర్పీ అగ్రహారం, సానారుద్రవరం, కోరుకొల్లు మీదుగా కైకలూరు వరకూ వెంకటేష్ భారీ ర్యాలీ నిర్వహించారు. వెంకటేశ్‌ను చూసేందుకు కూటమి శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దారి పొడవునా బారులుదీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకుసాగారు. అంతకు ముందు వెంకటేష్‌కు భారీ గజమాలతో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు.