సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటేశ్ - Suresh Babu meets CM Revanth Reddy
🎬 Watch Now: Feature Video
Published : Jan 27, 2024, 7:04 PM IST
Venkatesh and Suresh Babu meets CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు వెంకటేశ్, ఆయన సోదరుడు సినీ నిర్మాత సురేశ్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఫొటోలు దిగారు. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనను వెంకటేశ్, సురేశ్ బాబు కలవడం ఇదే తొలిసారి. ముగ్గురు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. మర్యాద పూర్వకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని, ఎలాంటి ప్రత్యేకమేమీ లేదని సురేశ్ ప్రొడక్షన్ సిబ్బంది తెలిపారు.
Venkatesh Saindhav Movie : మరోవైపు సినీ నటుడు వెంకటేశ్ నటించిన 75వ చిత్రం సైంధవ్ సంక్రాంతికి విడుదలైంది. వెంకటేశ్ నటన, యాక్షన్ సన్నివేశాలు, నవాజుద్దీన్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శైలేశ్ కొలను తెరకెక్కించారు. ఫిబ్రవరి 9 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైవ్లో విడుదల కానుంది.