జగన్ ఉత్తుత్తి ప్రారంభోత్సవాలను ప్రజలు నమ్మరు: కందుల నారాయణరెడ్డి - వెలిగొండ ప్రాజెక్టుకు జగన్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 5:47 PM IST

Veligonda Project Opening TDP Leaders Press Meet : వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా ఈ ప్రాంత ప్రజలకు ఏం ఉద్ధరించారని సీఎం జగన్ వస్తున్నారని తెలుగుదేశం నేత కందుల నారాయణరెడ్డి ప్రశ్నించారు. రేపు దోర్నాలలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో ఆయన మార్కాపురంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల (Election) స్టంట్​లో భాగంగా జగన్ చేసే ఉత్తుత్తి ప్రారంభోత్సవాలను ప్రజలను నమ్మరని ఆయన అన్నారు.

Veligonda Irrigation Project in Prakasam : టీడీపీ హయాంలోనే 80 శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టును మిగిలిన ఇరవై శాతం నాలుగున్నరేళ్లుగా పూర్తి చేయలేని మీరా ఈ ప్రాజెక్టుని ప్రారంభించేది అని నిలదీశారు. ఈ ప్రాంత ప్రజలపై ఇప్పుడు ప్రేమ పుట్టిందా అని ఎద్దేవా చేశారు. మరి కొద్దిరోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకే వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Irrigation Project ) ప్రారంభమని జగన్​ (Jagan) నాటకమని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు అసలు నగదు ఇవ్వకుండానే ప్రారంభిస్తామని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రజలకు నిజనిజాలను వెల్లడించేందుకు గ్రామాల్లో పర్యటిస్తామని నారాయణరెడ్డి వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.