దుర్గ గుడిలో ముగిసిన వారాహి నవరాత్రి ఉత్సవాలు - Varahi Navratri Utsavalu
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 3:19 PM IST
Varahi Navratri Utsavalu Complete in Vijayawada : విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో తొలిసారిగా నిర్వహించిన వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 6న పంచ వారాహి మంత్రాలతో కలశస్థాపన, అగ్ని ప్రతిష్టాపన, పుణ్యాహవచనం, మండపారాధానలతో ఉత్సవాలను రుత్వికులు ప్రారంభించారు. అమ్మవారికి తొమ్మిది రోజులపాటు జప, హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
వారాహి మితకు పూజ చేసిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 6వ తేదీ నుంచి 14 వరకు వారాహి నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసం శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులను నిర్వహిస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారని ఆలయ ఈవో కెఎస్ రామరావు తెలిపారు. చైత్రమాసంలో వసంత ఉత్సవాలు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు జరపడం వల్ల దేశంలో కరవు పరిస్థితులు ఏర్పడకుండా పంటలు బాగా పండుతాయని ఆలయ స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ పేర్కొన్నారు.