ఉల్లిరైతులకు నష్టం కలగకుండా చర్యలు చేపడతాం: ఎమ్మెల్యే గౌరు చరిత - MLA CHARITA INSPECTS ONION MARKET

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2024, 7:50 PM IST

Panyam MLA Gowru Charita Inspects Kurnool Onion Market : రైతులకు నష్టం జరగకుండా సాధ్యమైనంత మేర ఉల్లి కొనుగోలు చేయాలని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆదేశించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చరితా రెడ్డి అన్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యే మార్కెట్​కు వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రైతులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ పరిమితికి మించి సరుకు వస్తుండడంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. పరిస్థితి ఉన్నతాధికారులు, మంత్రి దృష్టికి తీసుకెళ్లి మరో మార్కెట్​ను అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. అనంతరం వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, లారీ యజమానులు, మార్కెట్ యార్డ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ఉల్లిని త్వరగా తరలించాలన్నారు. రైతులు సులువుగా ఉల్లి విక్రయించేలా ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.