బ్రిడ్జి సైడ్ వాల్‌లో ఇరుక్కున్న కారు - తప్పిన ప్రమాదం - ROAD ACCIDENT IN KURNOOL DISTRICT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2024, 7:26 PM IST
Car Stuck on Side Wall of Bridge in Adoni : కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ కారుకు ప్రమాదం తప్పింది. పట్టణంలోని పాత బ్రడ్జి సైడ్ వాల్‌లో కారు ఇరుక్కుంది. ఈ ఘటనలో కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదం తప్పడంతో బ్రడ్జి కింద ఉన్న దుకాణదారులు, పాదచారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కారు డ్రైవర్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి : జిల్లాలోని వెల్దుర్తి జాతీయ రహదారి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తు రహదారి పక్కనే ఉన్న ఇనుప దిమ్మెను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు బెళగల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అనిల్‌కుమార్, మరొకరు పాఠశాల ప్రిన్సిపల్ చిన్న మునిస్వామిగా తెలిపారు. కర్నూలు నుంచి వెల్దుర్తి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇనుప దిమ్మెను ఢీకొని రోడ్డు పక్కన ముళ్లచెట్లలో పడిపోయారని వివరించారు. మృతదేహాలను వెల్దుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.