ETV Bharat / offbeat

కార్తికమాసం స్పెషల్​ - ఉల్లిపాయలు లేని "పూరీ కర్రీ" - టేస్ట్​ సూపర్​ - చపాతీల్లోకి కూడా పర్ఫెక్ట్​! - POORI CURRY WITHOUT ONION

-ఇలా చేస్తే రుచి ఏ మాత్రం మారదు -కేవలం పూరీల్లోకి మాత్రమే కాదు చపాతీల్లోకి సూపర్​ కాంబినేషన్​

Puri Curry Without Onion
How to Make Poori Curry Without Onion (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2024, 12:27 PM IST

How to Make Poori Curry Without Onion: పూరీ.. అంటే చాలా మందికి ఇష్టం. సూపర్​ కాంబినేషన్​ అయినా పూరీ కర్రీతో తింటే దీని రుచే వేరు. అందుకే చాలా మంది బ్రేక్​ఫాస్ట్​, స్నాక్స్​గా పూరీలను చేసినప్పుడు ఈ కర్రీని తప్పకుండా ప్రిపేర్​ చేస్తుంటారు. ఈ పూరీ కర్రీలో మెయిన్​ ఇంగ్రిడియంట్​ అంటే ఉల్లిపాయ అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కార్తికమాసం నడుస్తోంది. ఈ క్రమంలో చాలా మంది ఈ నెలంతా ఉల్లి, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉంటారు. ఇక అలాంటి వారి పూరీ కర్రీనీ ప్రిపేర్​ చేసుకోలేరు. అయితే ఇకపై అలాంటి అవసరం లేకుండా కేవలం నిమిషాల్లోనే ఉల్లిపాయలు లేని పూరీ కర్రీని తయారు చేసుకోవచ్చు. టేస్ట్​ ఏ మాత్రమూ మారదు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? ఏఏ పదార్థాలు కావాలో ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • నూనె - 2 టీస్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్​
  • శనగపప్పు - 1 టీస్పూన్​
  • మినపప్పు - 1 టీ స్పూన్​
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • కరివేపాకు - 2 రెమ్మలు​
  • పచ్చిమిర్చి - 2
  • ఎండుమిర్చి - 2
  • అల్లం తరుగు - అర టీ స్పూన్​
  • క్యాబేజీ తురుము - 200 గ్రాములు
  • పసుపు - అర టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నీళ్లు - 400 ml
  • తాజా బఠానీ - అర కప్పు
  • శనగపిండి - టేబుల్​ స్పూన్​
  • ఆలూ - 2
  • చింతపండు గుజ్జు - 1 టేబుల్​ స్పూన్​

తయారీ విధానం:

  • ముందుగా బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఓ చిన్న గిన్నెలోకి శనగపిండి వేసి 50 ml నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు క్యాబేజీని శుభ్రంగా కడిగి సన్నగా కట్​ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్​ చేసుకోవాలి. చింతపండను నానబెట్టి గుజ్జుగా తీసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి ఆవాలు వేసి చిటపటలాడించిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి.
  • ఇప్పుడు జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండు మిర్చి, అల్లం తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీ, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి స్టవ్​ను హై ఫ్లేమ్​లో పెట్టి 3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి.
  • ఆ తర్వాత 400 ml నీళ్లు పోసుకుని కలిపి మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి మూత పెట్టి క్యాబేజీని మెత్తగా ఉడికించుకోవాలి.
  • క్యాబేజీ ఉడికిన తర్వాత తాజా బఠానీ వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి.
  • క్యాబేజీ, బఠానీ మెత్తగా ఉడికిన తర్వాత ముందే కలిపిపెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని మరో మారు కూరలోకి పోసుకోవాలి.
  • ఆ తర్వాత 150 ml నీళ్లు, ఉడికించిన ఆలూను చిదిమి వేసుకుని బాగా కలిపి చిక్కని చింతపండు గుజ్జును పోసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మంటను హై ఫ్లేమ్​ మీద పెట్టి మరో మూడు నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి.
  • అంతే ఎంతో రుచికరమైన ఉల్లిపాయలు లేని పూరీ కర్రీ రెడీ. ఇది పూరీ, చపాతీల్లోకి సూపర్​గా ఉంటుంది. మరి నచ్చితే మీరూ ట్రై చేయండి.

నోట్లో వేసుకుంటే కరిగిపోయే "పెసరపప్పు సున్నుండలు" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అద్భుతం!

క్రిస్పీ అండ్​ స్పైసీ "గోధుమపిండి కారప్పూస మిక్చర్​" - ఇలా చేస్తే ఎక్కువ రోజులు తాజాగా - టేస్ట్​ సూపర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.