MP Asaduddin Owaisi Comments on BRS: బీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని దారుస్సలంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొట్టారు. మూసీ ప్రక్షాళన కోసం బీఆర్ఎస్ ప్రణాళిక చేయలేదా అంటూ ప్రశ్నించారు. ఆ ప్రణాళిక వద్దని తాను చెప్పానని ఆ విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టాలా అంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్ జాతకాలు తన దగ్గర ఉన్నాయని, తాను నోరు విప్పితే ఆ పార్టీ నేతలు ఇబ్బంది పడతారని అన్నారు.
మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఒవైసీ విమర్శించారు. ఇప్పటికైనా ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇళ్లు కదల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే తాము స్వాగతిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ విధానాలు స్థిరంగా ఉండాలని, ఆ పార్టీకి 2023 ఎన్నికల్లో తమ మద్దతుతోనే జీహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. ఎన్నికల సమయంలో 24 మంది అభ్యర్థులను మార్చి ఉంటే మళ్లీ బీఆర్ఎస్యే అధికారంలోకి వచ్చేదని వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలకు అహంకారం ఉండేదని విమర్శించారు.
'బీఆర్ఎస్ జాతకాలు మా దగ్గర ఉన్నాయి. అవి చెబితే వాళ్లు తట్టుకోలేరు. ఆ విషయాలన్నీ నేను ఇప్పుడు బయటపెట్టాలా ? 24 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి ఉంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది' -అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత
బ్రాండ్ ఏపీ కోసం మంత్రి లోకేశ్ కృషి - పెట్టుబడిదారుల్లో సరికొత్త జోష్
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం : ఎక్కువ మంది సంతానం ఉండాలని చంద్రబాబు, డీఎంకే అంటున్నారని, అదే విషయాన్ని తాను చెప్పి ఉంటే రాద్ధాంతం చేసేవారని ఒవైసీ పేర్కొన్నారు. దక్షిణ భారతంలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారని తెలిపారు. జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని చెప్పారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గుతుందని అన్నారు. బాగా పని చేసిన రాష్ట్రాలకు ప్రోత్సహించకుండా శిక్షిస్తే ఏం లాభం ఉంటుందని వ్యాఖ్యానించారు.
నెక్లెస్ రోడ్ కూడా కూల్చివేస్తారా: మరోవైపు ఇటీవలే హైడ్రాపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలోని ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ప్రభుత్వ భవనాలను కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో బల్దియా భవనాన్ని నిర్మించారని, దాన్ని కూడా కూల్చివేస్తారా అని నిలదీశారు. నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందని దాన్ని కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించారు.
ఇన్‌స్టాలో పరిచయం - కట్‌చేస్తే ఏకంగా ఇంటికే కన్నం వేసిన బాలిక
అప్పుడు అధికారం - ఇప్పుడు అహంకారం- మారని వైఎస్సార్సీపీ నేతల వైఖరి