ETV Bharat / offbeat

సేవింగ్ అకౌంట్​లో ఎంత వరకు దాచుకోవచ్చు! - ఎక్కువ డబ్బులు వేస్తే ఏమవుతుందో తెలుసా? - CASH DEPOSIT LIMIT IN BANK ACCOUNT

ఆర్థిక లావాదేవీలకు బ్యాంకు ఖాతా తప్పనిసరి - ఎక్కువ డబ్బులు జమ చేస్తే ఐటీ నిఘా!

Savings Account Cash Deposit Limit
Savings Account Cash Deposit Limit (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2025, 5:17 PM IST

Savings Account Cash Deposit Limit : ప్రస్తుత డిజిటల్​ యుగంలో దాదాపు అందరికీ బ్యాంక్​ అకౌంట్స్ ఉండే ఉంటాయి. వీరిలో ఎక్కువ మంది పేమెంట్స్​ చేయడానికి యూపీఐ యాప్స్​ వాడుతున్నారు. ప్రభుత్వ పథకాలను పొందేందుకు, స్కాలర్​షిప్​, శాలరీ, ఇతర ఆర్థిక వ్యవహారాల కోసం ఏదో ఒక ప్రభుత్వ/ప్రైవేట్​ బ్యాంకులో సేవింగ్స్​​ అకౌంట్​ తప్పనిసరిగా ఉండాలి. సేవింగ్స్​ అకౌంట్​లో మీ డబ్బును సేఫ్​గా డిపాజిట్​ చేసుకోవడమే కాకుండా స్వల్ప వడ్డీని కూడా పొందొచ్చు. అయితే, మనలో చాలా మందికి బ్యాంకు సేవింగ్స్ అకౌంట్​లో ఎంత డబ్బు నిల్వ చేసుకోవచ్చు? ఎక్కువ డబ్బులు డిపాజిట్​ చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా? అని రకరకాల సందేహాలు వస్తుంటాయి. ఈ ప్రశ్నలకు ఆన్సర్స్​ ఇప్పుడు చూద్దాం.

లిమిట్ ఎంతంటే?

శాలరీ వచ్చినా, ఏదైనా ల్యాండ్​, ఫ్లాట్​ రిజిస్ట్రేషన్​ జరిగినా వచ్చిన సొమ్మును సేవింగ్స్​ అకౌంట్స్​లో డిపాజిట్​ చేస్తుంటారు చాలా మంది. ఈ క్రమంలో కొందరికి సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో ఎంత జమ చేయవచ్చనే విషయంపై సందేహం ఉంటుంది. అయితే సేవింగ్స్ అకౌంట్​లో ఎంత డబ్బైనా జమ చేసుకోవచ్చు. దానికి లిమిట్​ లేదు. కానీ ఆదాయపు పన్ను శాఖ ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్​లో జమ చేయగల నగదుపై రూ.10 లక్షల పరిమితిని విధించింది. దీంతో రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదుని జమ చేస్తే మీరు ఇన్​కమ్​ ట్యాక్స్​ పరిధిలో వస్తారు. ఆ డబ్బుకు మీరు పన్ను చెల్లించాల్సి రావొచ్చు. అలాగే రూ.10 లక్షల కంటే ఎక్కువ మనీ మీరు జమ చేస్తే ఐటీ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను శాఖ నిఘా పక్కా!

చాలా మంది మన బ్యాంక్​ అకౌంట్స్​ ఎవరు చెక్​ చేస్తారులే! అని అనుకుంటూ ఉంటారు. కానీ, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు కన్నా ఎక్కువ నగదు సేవింగ్స్ అకౌంట్​లో డిపాజిట్​ అయితే, ఆదాయపు పన్ను శాఖ మీపై నిఘా వేస్తుంది. మీ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ హిస్టరీని చెక్ చేస్తుంది. ఇలా రూ.10 లక్షల కన్నా డిపాజిట్లు దాటిన సేవింగ్స్ అకౌంట్స్​ వివరాలను బ్యాంకులు ఐటీ శాఖకు తెలియజేస్తాయి. దీంతో సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారుడికి ఐటీ శాఖ నోటీసులు పంపే ఛాన్స్​ ఉంది. ఎఫ్​డీలలో నగదు డిపాజిట్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్​లో పెట్టుబడులు, ఫోరెక్స్ కార్డులు మొదలైన విదేశీ కరెన్సీ కొనుగోళ్లకు కూడా రూ.10 లక్షల పరిమితి వర్తిస్తుంది.

రైతులకు రూ.5లక్షల రుణం - 'కిసాన్ క్రెడిట్ కార్డ్' దరఖాస్తు ఇలా!

12% వడ్డీ అంటే ఒక్క రూపాయి - బ్యాంకు లోన్లపై వడ్డీ సింపుల్​గా ఎలా లెక్కించాలంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.