ETV Bharat / state

కార్తికమాసం స్పెషల్​ - శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు - SPECIAL BUSES TO SHIVALAYAM TEMPLE

పవిత్ర కార్తిక మాసం సందర్భంగా 'టీజీఎస్ఆర్టీసీ స్పెషల్‌' బస్సులు - భక్తుల సౌకర్యార్థం పలు దేవాలయాల రూట్లలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లుడించిన ఎండీ సజ్జనార్

TGSRTC Karthika Masam Special Buses
TGSRTC Karthika Masam Special Buses (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2024, 9:30 PM IST

TGSRTC Karthika Masam Special Buses : తెలుగు రాష్ట్రాల్లో పవిత్ర కార్తిక మాసంలో ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వివరాలను ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. శ్రీశైలం, ధ‌ర్మపురి, వేముల‌వాడ, కీస‌ర‌గుట్ట, త‌దిత‌ర దేవాల‌యాల‌కు తెలంగాణలోని హైద‌రాబాద్ నుంచి స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని పేర్కొన్నారు. ఆర్టీసీ ప‌ని తీరు, కార్తిక‌ మాసం ఛాలెంజ్, శ‌బ‌రిమ‌ల ఆపరేష‌న్స్‌, మహాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్య ప‌థ‌కం, త‌దిత‌ర అంశాల‌పై హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ నుంచి ఉన్నతాధికారులతో నేడు దృశ్య మాధ్యమ స‌మీక్షా స‌మావేశాన్ని సంస్థ ఎండీ సజ్జనార్ నిర్వహించారు.

అరుణాచ‌లానికి ప్రత్యేక ప్యాకేజీ : ఆర్టీసీకి కార్తిక మాసం, శ‌బ‌రిమ‌ల ఆప‌రేష‌న్స్ ఎంతో కీల‌క‌మ‌ని, భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా త‌గు చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌కు సజ్జనార్‌ దిశా నిర్దేశం చేశారు. ఆది, సోమ‌వారాలు శైవ‌క్షేత్రాల‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని, అందుకు అనుగుణంగా ప్రత్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. ఈ నెల 15న కార్తిక పౌర్ణమి నేప‌థ్యంలో త‌మిళ‌నాడులోని అరుణాచ‌లానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామ‌ని తెలిపారు.

కార్తికమాసం స్పెషల్​ - ఉల్లిపాయలు లేని "పూరీ కర్రీ" - టేస్ట్​ సూపర్​ - చపాతీల్లోకి కూడా పర్ఫెక్ట్​!

చార్జీలు త‌గ్గింపు : ఏపీలోని పంచారామాల‌కు ప్రతి సోమ‌వారం ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్నట్లు వివ‌రించారు. ఈ ప్రత్యేక బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ను tgsrtcbus.in వెబ్‌సైట్‌లో చేసుకోవాల‌ని సూచించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-23450033, 040-69440000 సంప్రదించాల‌ని సూచించారు. బ‌స్ ఆన్ కాంట్రాక్ట్(బీవోసీ) చార్జీలు త‌గ్గించినట్లు తెలిపారు.

శుభ‌ముహుర్తాలకు అద్దెకు ఆర్టీసీ బ‌స్సుల‌ు : అద్దె ప్రాతిపదిక‌న తీసుకునే ఆర్టీసీ బ‌స్సు చార్జీలను త‌గ్గించిన‌ట్లు సజ్జనార్ పేర్కొన్నారు. ప‌ల్లె వెలుగు బస్సుకు కిలోమీట‌ర్‌కు 11 రూపాయలు, ఎక్స్ ప్రెస్ రూ.7, డీల‌క్స్ రూ.8, సూప‌ర్ ల‌గ్జరీకి 6 రూపాయలు, రాజ‌ధాని 7 రూపాయల వరకు త‌గ్గించిన‌ట్లు పేర్కొన్నారు. శ‌బ‌రిమ‌ల‌కు, శుభ‌ముహుర్తాలకు అద్దెకు ఆర్టీసీ బ‌స్సుల‌ను బుకింగ్ చేసుకుని క్షేమంగా గ‌మ్యస్థానాల‌కు చేరుకోవాల‌ని ఆకాంక్షించారు.

కార్తికమాసం స్పెషల్​ - శ్రీశైలం దర్శించుకునేందుకు IRCTC సూపర్​ ప్యాకేజీ - పైగా యాదాద్రి వెళ్లొచ్చు!

కార్తికమాసం స్పెషల్ - పంచారామాలకు, శబరిమలకు ప్రత్యేక బస్సులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.