ETV Bharat / international

సైబర్‌ ముప్పు దేశాల జాబితాలో 'భారత్‌' పేరు - ఆగని కెనడా కవ్వింపు చర్యలు!

భారత్​ను సైబర్‌ ముప్పు దేశాల జాబితాలో చేర్చిన కెనడా - తీవ్రంగా ఖండించిన ఎంఈఏ

justin trudeau
justin trudeau (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2024, 10:35 PM IST

India Canada News Updates : కెనడా వరుస కవ్వింపు చర్యలతో భారత్​ను విసిగిస్తోంది. దీనితో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింతగా క్షీణిస్తున్నాయి. తాజాగా భారత్​ను సైబర్​ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. చైనా, రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియా తర్వాత భారత్‌ నుంచి తమకు సైబర్‌ ముప్పు పొంచి ఉంచి ఉన్నట్లు ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా భారత్‌ తమపై గూఢచర్యానికి పాల్పడుతోందని పేర్కొంది.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పై ఆ దేశానికి చెందిన ఓ మంత్రి అసంబద్ధ ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే ట్రూడో సర్కార్​ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్‌ను సైబర్‌ ముప్పు దేశాల జాబితాలో చేర్చింది. అయితే దీనిని భారత్‌ విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. భారత్‌ కీర్తి ప్రతిష్ఠలను మసకబార్చాలనే తప్పుడు ఉద్దేశంతోనే కెనడా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నట్లు ఘాటుగా విమర్శించింది. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ కెనడా తీరును ఎండగట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్‌పై కెనడా నిందలు మోపుతోందని మండిపడ్డారు.

సైబర్ థ్రెట్​
నేషనల్‌ సైబర్‌ థ్రెట్‌ అసెస్‌మెంట్‌ 2025-2026 పేరిట కెనడా తాజాగా ఓ నివేదికను సిద్ధం చేసింది. అందులో భారత్‌ పేరును చేర్చింది. భారత్‌ నాయకత్వం తమ దేశంలో సైబర్‌ దాడులకు పాల్పడేందుకు ప్రణాళికలు రచిస్తోందని నిరాధార ఆరోపణలు చేసింది. తీవ్రవాద వ్యతిరేక కార్యకాలాపాల పేరుతో గూఢచర్యానికి పాల్పడుతోందని విమర్శించింది.

ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్‌ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో గతేడాది చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల నిజ్జర్‌ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మ పేరును చేర్చింది. దీనితో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంజయ్‌ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్‌ వెనక్కి రప్పించింది. అదే సమయంలో దిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్‌ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.