LIVE : తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు - Ugadi Celebrations 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 9, 2024, 12:02 PM IST
|Updated : Apr 9, 2024, 12:16 PM IST
Ugadi Celebrations at Telangana Bhavan in Hyderabad Live : తెలుగువారి నూతన సంవత్సరం అంటే ఉగాది పండగనే అని చెబుతారు. ముఖ్యంగా ఉగాది రోజు తెలుగు లోగిళ్లలో భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, పంచాంగ శ్రవణం ఆలకిస్తారు. ఉగాది పర్వదినాన పండితులు చెప్పే రాశి ఫలాలను అందరూ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండగను చిన్నాపెద్దా అంతా కలిసి కట్టుగా చేసుకుంటారు. ఆరోజు తీపి, కారం, వగరు, ఉప్పు, పులుపు, చేదు వంటి షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని సేవిస్తారు. ఈ పదార్థం తయారీ వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి చిహ్నంగా చెబుతారు. ఇప్పుడు తెలుగు నామ సంవత్సరంలో శోభకృత్ నామ సంవత్సరం నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
Last Updated : Apr 9, 2024, 12:16 PM IST