ఏలూరు జిల్లాలో విషాదం - తీవ్ర అస్వస్థతకు లోనై ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి - ఏలూరు జిల్లా ఫుడ్ పాయిజన్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 1:40 PM IST
Two Children Died of Food Poisoning in Eluru District : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. తీవ్ర అస్వస్థతకు లోనై ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. నంద్యాల జిల్లా వైఎస్సార్ కాలనీకి చెందిన రవి జీవనోపాధి నిమిత్త ప్లాస్టిక్ వ్యాపారం చేసుకుని జీవించేందుకు జంగారెడ్డిగూడెం వలస వచ్చాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి తన ఇద్దరు పిల్లలు రామకృష్ణ (10), విజయ్ (6) తీవ్రమైన వాంతులతో అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గంలోనే పెద్ద కుమారుడు రామకృష్ణ మరణించాడు. అనంతరం చిన్న కుమారుడు విజయ్ మరణించాడు. దీంతో ఆ కుటుంబం మెుత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. రాత్రి రామకృష్ణ, విజయ్‌లు పానీపూరి బండి వద్ద పానీ పూరి తిన్నారనీ, దానివల్లే ఫుడ్ పాయిజన్ జరిగి తన ఇద్దరు బిడ్డలు మరణించి ఉంటారని చిన్నారుల తండ్రి రవి ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.