LIVE : తిరుపతి లడ్డూ వివాదం- టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియా సమావేశం - Ramana Deekshitulu Live - RAMANA DEEKSHITULU LIVE
🎬 Watch Now: Feature Video


Published : Sep 20, 2024, 10:34 AM IST
|Updated : Sep 20, 2024, 12:06 PM IST
Ramana Deekshitulu Live : తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరాపై దుమారం రేగుతోంది. కమీషన్ల కోసమే నాటి ఈవో ధర్మారెడ్డి అర్హత లేని కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎన్డీడీబీ నివేదికలో సైతం జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్దారణ అవ్వడంతో వైఎస్సార్సీపీపై అన్ని పార్టీల నేతలు, , ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కమీషన్ల కోసమే గత ప్రభుత్వం లడ్డూ నాణ్యతలో రాజీపడినట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నాణ్యత కమిటీ సభ్యులు 9 సంవత్సరాలుగా కొనసాగుతున్నా వారిని మార్చలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూమన కరుణాకర రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి టీటీడీ నిధుల నుంచి కమీషన్లు తీసుకొని శ్రీవారి ఆలయాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. మరోవైపు గత ఐదేళ్లలో తిరుమలలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా ఇదే విషయంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పాల్గొన్నారు.
Last Updated : Sep 20, 2024, 12:06 PM IST