ఉచిత బస్సు పథకం - గత 45 రోజుల్లో 12 కోట్లకు పైగా మహిళలు ప్రయాణం : వీసీ సజ్జనార్​ - TSRTC New Buses in Telangana

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 6:52 PM IST

TSRTC MD VC Sajjanar on Blind Employment : రాష్ట్ర రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది చరిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ రాష్ట్ర టీఎస్​ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. గత 45 రోజులుగా 12 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేశారని ఆయన వివరించారు. అయితే ఒకరికి మంచి జరిగితే, ఇంకొకరికి ఇబ్బందులు జరగడం బాధాకరమని అన్నారు. ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలోనూ మహిళలు కూర్చుంటున్నారని సజ్జనార్ అన్నారు.

VC Sajjanar Latest News : హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల్లో సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్​ను ఆవిష్కరించారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, త్వరలో 2375 కొత్త బస్సులను తీసుకుంటున్నామని తెలిపారు. అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆర్టీసీలో అనౌన్స్​మెంట్, ఎంక్వయిరీ రూమ్ జాబ్స్​లలో అంధులకు అవకాశం కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.