మద్యం సేవిస్తూ అధికారి విధులు - సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన దృశ్యాలు - Mahabubabad Drunk Officer - MAHABUBABAD DRUNK OFFICER
🎬 Watch Now: Feature Video
Published : Jun 18, 2024, 3:50 PM IST
Transport Dept Officer on duty While Drinking Alcohol : రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తరచూ దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా, ఉద్యోగులు తమ పనితీరును మార్చుకోవడం లేదు. పలువురు లంచాలకు తెగబడుతుంటే, మరికొందరు బరి తెగించి మద్యం సేవిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులో చోటుచేసుకుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సురేశ్ మద్యం తాగుతూ విధులు నిర్వహిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
నిత్యం వందలాది మంది తమ పనుల కోసం రవాణా శాఖ కార్యాలయానికి వస్తూ, పోతూ ఉంటారు. ప్రభుత్వ శాఖ కార్యాలయంలో ఈ విధంగా మద్యం సేవిస్తూ విధులు నిర్వహించడం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్థానిక అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు విచారణ చేసి తప్పు చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకొని మరోసారి ఈవిధంగా జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.