చేపల గుంతలో ముగ్గురు విద్యార్థులు మృతి-చిన్నారుల మృతితో అల్లాడిపోయిన తల్లిదండ్రులు - Three Students Died with Swimming - THREE STUDENTS DIED WITH SWIMMING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2024, 7:54 PM IST
Three Students Died With Swimming in Prakasam District : ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఎస్ కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులను మృత్యువు వెంటాడింది. గ్రామ శివారులోని ఓ రైతు చేపల పెంపకం కోసం తీసిన గోతిలోకి ముగ్గరు విద్యార్థులు ఈతకు వెళ్లారు. ఊపరి ఆడక ముగ్గరు విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అప్రమత్తమైన స్థానికులు విద్యార్థులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. అయితే గుంతలో పడిన విద్యార్థులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
మృతులు కొత్తపల్లి శివ (10), మను(8), ఏడుకొండలు (9)గా గుర్తించారు. రైతు చేపల పెంపకం కోసం తీసిన గుంతకు రక్షణ కంచె లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారుల మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.