ఘోర రోడ్డు ప్రమాదం- దైవదర్శనానికి వెళ్తు ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి - Three Died in Tractor Overturn - THREE DIED IN TRACTOR OVERTURN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 28, 2024, 4:16 PM IST
Three People Died After Tractor Overturn in Yazali: బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా కొంత మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే నగరం మండలం గట్టువారిపాలెం నుంచి కొండపాటూరు దేవాలయానికి మొక్కు తీర్చుకోవడానికి 20 మందికి పైగా బంధువులు, గ్రామస్థులు ట్రాక్టరులో బయలుదేరారు. యాజలి హైస్కూల్ సమీపంలో దమన్నవారిపాలెం రహదారిలో ఎదురుగా వస్తోన్న బస్సును తప్పించి అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రమాదంలో మరణించారు. మిగిలిన వారు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షగాత్రులు, మృతులు ముగ్గురు గట్టువారిపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు గట్టు కోటేశ్వరరావు (65), గడ్డం శివనాగులు (60), గడ్డం లక్ష్మి(40)గా గుర్తించారు. ప్రమాద స్థలాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పరిశీలించి బాధితులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.