సికింద్రాబాద్ క్లబ్ వద్ద కారు బీభత్సం - వీడియో వైరల్ - Car Accident In Cantonment - CAR ACCIDENT IN CANTONMENT
🎬 Watch Now: Feature Video
Published : Jun 6, 2024, 1:47 PM IST
Car Accident Secunderabad Cantonment : కంటోన్మెంట్ సికింద్రాబాద్ క్లబ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారు మూడు పల్టీలు కొట్టగా ఆ వాహనంలో ఉన్న వారు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. క్లబ్ వద్దకు రాగానే సిగ్నల్ పడుతుందన్న తొందరలో ఓ కారు డ్రైవర్ అతి వేగంగా వస్తున్నాడు, అదే సమయంలో పక్క నుంచి వచ్చిన కారు సదరు వాహనాన్ని ఢీ కొట్టడంతో ఆ కారు మూడు పల్టీలు కొట్టి డివైడర్ల మీదుగా పక్కకు పడిపోయింది. ఇది అక్కడున్న సీసీటీవీల్లో రికార్డయింది.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో కారులో ఉన్నవారిని బయటకు తీయగా వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఘటనా దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనదారులకు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. త్వరగా గమ్యానికి చేరుకోవాలనే తొందరలో వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి ప్రయాణించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు.