కనక దుర్గమ్మ సన్నిధిలో జరిగే ఉత్సవ తేదీలు ఇవే - మొదటిసారి వారాహి ఉత్సావాలకు శ్రీకారం - Festivities on Indrakeeladri - FESTIVITIES ON INDRAKEELADRI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 8:29 PM IST
|Updated : Jun 30, 2024, 9:58 PM IST
Temple EO Announced the Dates of Festivities on Indrakeeladri : ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో జరిగే ఉత్సావాల తేదీలను దేవస్థాన ఈవో రామరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జులై 6 నుంచి ఆగష్టు 2వ తేది వరకు ఇంద్రకీలాద్రి పై ఆషాఢ మాస సారె మహోత్సవాన్ని నిర్వహిస్తునట్లు వెల్లడించారు. అలాగే జులై నెలలో 19,20,21వ తేదిల్లో శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా దుర్గమ్మ సన్నిధిలో మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలు చేస్తున్నామని వివరించారు. జులై 14న తెలంగాణ మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనంగా సమర్పిస్తారని చెప్పారు.
ఆ సమయంలో అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్న తరుణంలో ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని తెలిపారు. అమ్మవారికి నివేదన సమయంలో సామన్య భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించామన్నారు. సామాన్య భక్తులకు దర్శన సమయంలో ఎటువంటి ఆటంకం కలగకూడదనే ప్రోటోకాల్ దర్శనాలను నిలిపివేస్తున్నామని ఈవో రామరావు పేర్కొన్నారు.