'రాగల నాలుగు రోజులు భారీ వర్షాలు - నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి' - Hyderabad IMD Officer Interview - HYDERABAD IMD OFFICER INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : Jun 7, 2024, 5:20 PM IST
Telangana IMD Report Today : ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదారాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని రాగల నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదలడం, ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ ప్రభావంతో రెండు రోజులు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
Hyderabad Weather Report : ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు. 20 తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు బలపడి దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో పగలు కొద్దిగా పొడి వాతావరణం ఉన్నా సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. మరిన్ని విషయాలను వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి మాటల్లో తెలుసుకుందాం.