LIVE : గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ నేతల నిరసనలు - Congress Leaders Protest At GunPark
🎬 Watch Now: Feature Video
Telangana Congress Leaders Protest At Gun Park Live : సెబీ చీఫ్ మాదాబి పూరీ బుచ్ రాజీనామా చేయాలని, అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటికీ డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళుతున్నారు. అక్కడ ఈడీ కార్యాలయం బయట సీఎంతో సహా కాంగ్రెస్ నాయకులు అంతా బైఠాయించి నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ గన్‌పార్క్ వద్ద చేస్తున్న నిరసనలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. అదానీకి రాష్ట్రంలోకి స్వాగతం పలికి ఇప్పుడు నిరసనలు ఏంటని ప్రశ్నించారు.
Last Updated : Aug 22, 2024, 2:18 PM IST