LIVE : ఐఎస్బీ 'లీడర్ షిప్ సమ్మిట్-2024'లో సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH LIVE
🎬 Watch Now: Feature Video
Published : Oct 20, 2024, 11:43 AM IST
|Updated : Oct 20, 2024, 11:48 AM IST
Telangana CM Revanth Reddy Live : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెం1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నైపుణ్యవంతమైన యువతను తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి స్కిల్ ట్రైనింగ్ ఇప్పించనున్నట్లుగా వెల్లడించారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకున్న ఎంతోమంది మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నట్లుగా తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి అంతా కలిసి రావాలని కోరారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెందించే దిశగా తాను మంత్రులు నిరంతరం పనిచేస్తుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్పై పలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఏర్పాటు చేసిన ఐఎస్బీ లీడర్ షిప్ సమ్మిట్-2024కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
Last Updated : Oct 20, 2024, 11:48 AM IST