LIVE : AEEల నియామక పత్రాల కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి - CM Revanth Reddy Live - CM REVANTH REDDY LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2024, 6:16 PM IST

Updated : Sep 26, 2024, 6:38 PM IST

CM Revanth Gives Appointment orders to irrigation AEE Live : నీటిపారుదల శాఖలో కొత్తగా చేరిన ఏఈఈలకు సీఎం రేవంత్​రెడ్డి ఇవాళ నియామకపత్రాలు అందజేశారు. హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 700 మంది ఏఈఈలు నియామకపత్రాలు అందుకున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు సలహాదారులు, ఉన్నతాధికారులు, ఈఎన్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కొత్తగా 18 వందల లష్కర్ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. అనంతరం ప్రాధాన్య ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇస్తారు. కొత్తగా 6 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని సీఎం సమీక్షిస్తారు. నల్గొండ జిల్లాలో ఎస్​ఎల్​బీసీ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి సహా ఇతర ప్రాజెక్టుల్ని మంత్రులు తాజాగా సందర్శించి వచ్చారు. క్షేత్రస్థాయిలో పనుల వేగానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. నీటిపారుదల శాఖలో ఏఈ నుంచి ఈఎన్సీ వరకు అన్నిస్థాయుల ఇంజినీర్లను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి. 
Last Updated : Sep 26, 2024, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.