LIVE : నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం - Telangana BJP Leaders Press Meet - TELANGANA BJP LEADERS PRESS MEET
🎬 Watch Now: Feature Video
Published : Jun 6, 2024, 3:25 PM IST
|Updated : Jun 6, 2024, 3:40 PM IST
Telangana BJP Leaders Press Meet LIVE :రాష్ట్రంలో ఇటీవల వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు బీజేపీ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీపై విశ్వాసం ఉంచి అధిక స్థానాల్లో గెలిపించారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు 35 శాతానికి పైగా ఓట్లు వేశారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క శాతం మాత్రమే పెరిగిందని అన్నారు.అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభలో కాంగ్రెస్‌కు ఒక్క శాతం ఓటింగ్ మాత్రమే పెరిగింది. తెలంగాణలో చాలా చోట్ల బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రాలేదన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలబడ్డారని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి ఓటు వేశారన్నారు. మోదీ చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి గెలిచిన మల్కాజిగిరిలో కూడా భాజపా గెలిపిందని పార్టీ నాయకులు తెలిపారు.
Last Updated : Jun 6, 2024, 3:40 PM IST